మెడ నొప్పి వచ్చినప్పుడు మొదటగా చేయాల్సింది వేడి లేదా చల్లని థెరపీ. హాట్ లేదా కూల్ వాటర్ బ్యాగ్స్ మెడపై 10-15 నిమిషాలపాటు ఉంచటం వల్ల నొప్పి నుండీ రిలీఫ్ ఉంటుంది.
మెడ వ్యాయామాలు చేయటం
కొంత సమయం కేటాయించి స్లోగా మెడను కుడివైపు, ఎడమ వైపు, ముందు, వెనుకకు తిప్పండి. అలాచేస్తే మెడకి రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
సరైన పొజిషన్‌లో కూర్చోండి
మొబైల్, ల్యాప్‌టాప్, లేదా కంప్యూటర్ వాడేటప్పుడు మనం ఎక్కువగా మెడను వంచి కూర్చుంటాం. అలా కాకుండా వెన్నెముక సూటిగా ఉంచేలా కూర్చోండి.
స్లీపింగ్ పొజిషన్
నిద్రించే సమయంలో మెడకు సరిపడే ఎత్తున్న దిండును వాడండి. అలాగే సైడ్ లేదా బ్యాక్ పొజిషన్‌లో నిద్రించడం ఉత్తమం.
ఎక్కువ సమయం కూర్చోకండి
ఆఫీస్‌లో పని చేసే వారు లేదా డ్రైవింగ్ ఎక్కువ చేసే వారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకోవాలి.
దీని ద్వారా కండరాల ఒత్తిడి తగ్గుతుంది.
మసాజ్ చేయించుకోండి
కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేదా మెంథాల్ ఆయిల్‌తో చేసే సున్నితమైన మసాజ్ వలన రక్తప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. దీని ద్వారా కండరాల ఒత్తిడి తగ్గుతుంది.
నీరు ఎక్కువగా తాగండి
డీహైడ్రేషన్ వలన కండరాలు గట్టిపడతాయి. అందుకే రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగడం వలన శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి.
ఒత్తిడిని తగ్గించండి
మానసిక ఒత్తిడి వలన కూడా మెడ కండరాలు గట్టిపడతాయి.రోజూ 15–20 నిమిషాలు యోగా, ధ్యానం, లేదా శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా రిలాక్స్ అవ్వండి.
పొగ త్రాగడం మానండి
స్మోకింగ్ వలన రక్తప్రసరణ తగ్గుతుంది, కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకే వీలైనంత వరకూ పొగ త్రాగడం తగ్గించండి.
వైద్యుడిని సంప్రదించండి
నొప్పి 3 రోజుల కంటే ఎక్కువగా కొనసాగితే లేదా చేతులు మొద్దుబారడం ఉంటే ఫిజియోథెరపిస్టు లేదా ఆర్థోపెడిక్ డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.