జాయింట్ పెయిన్స్

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో మొదట కనిపించే సంకేతం జాయింట్ పెయిన్స్. ముఖ్యంగా పాదాల బొటనవేళ్ళు, మోకాళ్లు, మోచేయి వంటి ప్రాంతాలు.

జాయింట్ వాపు 

జాయింట్లలో యూరేట్ క్రిస్టల్స్ పేరుకుపోతాయి. దీని వలన ఆ భాగంలో వాపు, ఎర్రబడటం, మండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

గౌట్ సమస్యలు 

జాయింట్లు గట్టిపడిపోవడం వలన కదలికలలో ఇబ్బంది వస్తుంది. దీనివల్ల కాళ్లు లేదా చేతులు కదిలించేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. 

అలసట 

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి సరిగా ఉపయోగించబడదు. దీని వలన చిన్న పనికే ఎక్కువగా అలసిపోతారు. 

మూత్ర సమస్యలు 

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కిడ్నీలు దానిని సరిగా ఫిల్టర్ చేయలేవు. దీని వలన మూత్రంలో మంట, తరచుగా మూత్రం రావడం, మూత్రం సరిగా రాకపోవడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి.  

రాత్రి నొప్పి పెరగడం

గౌట్ సమస్య ఉన్నవారిలో యూరేట్ క్రిస్టల్స్ ఎక్కువగా పేరుకుపోయి రాత్రివేళల్లో జాయింట్ నొప్పి ఎక్కువగా ఉంటుంది.  

చర్మ సమస్యలు

చర్మంపై ఎరుపు, దురద, మండుట వంటి సమస్యలు వస్తాయి. జాయింట్ల దగ్గర చర్మం కఠినంగా మారడం, ఎండిపోవడం కూడా జరుగుతుంది. 

జ్వరం లాంటి ఫీల్

కొంతమందికి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగినప్పుడు  శరీరం వేడిగా అనిపించడం, బలహీనత, చెమటలు రావడం వంటి జ్వరం లాంటి అనుభూతి కలుగుతుంది.

ఆహారంపై ఆసక్తి తగ్గడం

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారికి తరచుగా ఆకలి తగ్గిపోతుంది. దీని వలన బరువు తగ్గడం, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం జరుగుతుంది.  

హై బీపీ / హృదయ సమస్యలు 

యూరిక్ యాసిడ్ అధికం కావడం వలన రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీలు, రక్తనాళాలు ప్రభావితం కావడం వలన హృదయంపై ఒత్తిడి పెరుగుతుంది.