గుడ్లు
గుడ్లలోని పచ్చసొన విటమిన్ B12 కి మంచి మూలం. ఇది రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
పాలు మరియు పాల ఉత్పత్తులు
పాలు, పెరుగు, పనీర్ వంటి పదార్థాలు పాల ఆధారిత పదార్ధాలు విటమిన్ B12 ని సమృద్ధిగా అందిస్తాయి.
చేపలు
సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, సార్డిన్ ఫిష్ వంటి సీ ఫుడ్స్ లో విటమిన్ B12 ఎక్కువగా లభిస్తుంది. ఇవి మెదడు, నరాల ఆరోగ్యానికి మంచివి.
చికెన్
మాంసాహారంలో చికెన్ తక్కువ కొవ్వుతో పాటు విటమిన్ B12 ని కూడా అందిస్తుంది. ఇది ఎనర్జీని పెంచటమే కాకుండా నరాల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
బీఫ్ లేదా మటన్
వీటిలో విటమిన్ B12 హై లెవల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇది రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది.
సముద్ర ఆహారాలు
క్లామ్స్, క్రాబ్స్,ష్రింప్స్ లలో విటమిన్ B12 అధిక మోతాదులో ఉంటుంది. ఇవి రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి.
ఫోర్టిఫైడ్ సెరల్స్
వెజిటేరియన్స్ కోసం తయారు చేసిన సెరల్స్ లో విటమిన్ B12 ఫోర్టిఫై చేసి ఉంటుంది. అందుకే ఇది మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది.
సోయా ఉత్పత్తులు
టోఫు, సోయా మిల్క్ వంటివి విటమిన్ B12ని కొంతమేర అందిస్తాయి. శాకాహారుల కోసం ఇది మంచి డైట్.
చీజ్
ముఖ్యంగా స్విస్, చెడార్ చీజ్‌లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇది నరాల ఆరోగ్యం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఫోర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్
బాదం, ఓట్స్, లేదా కోకోనట్ మిల్క్ ఫోర్టిఫైడ్ వెర్షన్‌లో విటమిన్ B12 ఎక్కువగా లభిస్తుంది.