త్రికటు కషాయం అంటే ఏమిటి?
మూడు శక్తివంతమైన పదార్థాలతో తయారైనదే ఈ త్రికటు కషాయం. ఇది సహజమైన ఆయుర్వేద చికిత్సగా ప్రాచుర్యం పొందింది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
త్రికటులో ఏవి ఉంటాయి?
త్రికటులో సౌంత్ (డ్రై జింజర్), మిరియాలు, పిప్పలి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేసి, రక్తనాళాల్లో కొవ్వును తగ్గించి, BP నియంత్రణలో ఉంచుతాయి.
శరీర వేడిని తగ్గిస్తుంది
త్రికటు కషాయం శరీర వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది అధిక
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
రక్తనాళాలను శుభ్రం చేస్తుంది
త్రికటు కషాయం నాడుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, రక్తప్రసరణను మెరుగుపరచి, హృదయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
విషతత్వాలను తొలగిస్తుంది
ఈ కషాయం శరీరంలో విషతత్వాలను తొలగించి, మూత్ర విసర్జన ద్వారా శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది.
మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది
అధిక బరువు BP పెరగడానికి ప్రధాన కారణం. అలాంటి శరీర కొవ్వును కరిగించి, బరువును తగ్గించి, మెటబాలిజాన్ని పెంచటంలో ఈ త్రికటు మసాలాలు సహాయపడతాయి.
ఇమ్యూనిటీ సిస్టంను బలోపేతం చేస్తుంది
త్రికటులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి, హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.
నాడీ వ్యవస్థకు శాంతిని అందిస్తుంది
త్రికటు కషాయం మానసిక ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. దీని వల్ల BP అదుపులో ఉంటుంది.
ఎలా తయారు చేసుకోవాలి?
ఒక గ్లాసు నీటిలో త్రికటు పొడి వేసి మరిగించి, తగినంత తేనె కలిపి తాగాలి. రోజూ ఉదయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎప్పుడు తాగాలి?
ఈ కషాయాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అధిక రక్తపోటును నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.