కోల్డ్ కంప్రెస్/ఐస్ ప్యాక్

కళ్ళ మీద కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ లేదా చల్లని స్పూన్ 5-10 నిమిషాలు పెట్టుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి వాపు తగ్గుతుంది.

కీరదోస ముక్కలు

ఫ్రిజ్‌లో చల్లగా ఉంచిన కీర ముక్కలు కళ్ళ మీద పెట్టుకుంటే చల్లదనం ఇస్తుంది. కీరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వలన కళ్ళ వాపు, నల్లటి మచ్చలు తగ్గుతాయి.  

గ్రీన్ టీ బ్యాగ్స్  

వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్‌ని చల్లగా ఉంచి కళ్ళ మీద 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇవి యాంటీఆక్సిడెంట్స్, టానిన్స్‌తో నిండి ఉండి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

తగినంత నిద్ర

రోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్ర లోపం వల్ల కళ్ళ చుట్టూ వాపు, నల్లటి మచ్చలు వస్తాయి. సరైన నిద్ర కళ్ళ ఆరోగ్యానికి బేసిక్ సొల్యూషన్.  

తక్కువ ఉప్పు  

రోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్ర లోపం వల్ల కళ్ళ చుట్టూ వాపు, నల్లటి మచ్చలు వస్తాయి. సరైన నిద్ర కళ్ళ ఆరోగ్యానికి బేసిక్ సొల్యూషన్.

ఎక్కువ నీళ్లు  

డీహైడ్రేషన్ పఫీ కళ్ళకు ప్రధాన కారణం. రోజుకి 8–10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటికి వెళ్ళి వాపు తగ్గుతుంది. 

అలర్జీ కంట్రోల్

దుమ్ము, ధూళి, పుప్పొడి, స్మోక్ వంటి వాటికి కళ్ళు ఎర్రబడి వాపు వస్తుంది. అందుకోసం అలర్జీ మందులు తీసుకోవడం లేదా ప్రివెన్షన్ చేయడం అవసరం.  

ఐ-క్రీమ్/ఐ-జెల్స్  

కాఫీన్ లేదా హయాలురోనిక్ యాసిడ్ ఉన్న ఐ-జెల్స్ వాడితే కళ్ళ చుట్టూ చర్మం బలపడుతుంది. వీటివల్ల వాపు తగ్గి కళ్ళు ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

తల ఎత్తి నిద్రించడం

పూర్తిగా ఫ్లాట్‌గా పడుకుంటే కళ్ళ చుట్టూ ద్రవం చేరి వాపు పెరుగుతుంది. దాన్ని నివారించడానికి రెండు దిండ్లపై తలను కొంచెం ఎత్తుగా పెట్టి నిద్రించాలి.  

స్మోకింగ్ & ఆల్కహాల్ తగ్గించడం 

సిగరెట్, మద్యం వాడకం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. వీటిని తగ్గించడం వల్ల కళ్ళ వాపు, నల్లటి మచ్చలు తగ్గుతాయి.