జీర్ణ వ్యవస్థకు మేలు
నారింజ తొక్కలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది
ఇది యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండి చర్మానికి నూర్య కాంతి ప్రభావాన్ని తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది
తొక్కలోని నేచురల్ ఆయిల్స్ శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండీ ఉపశమనం కలిగిస్తుంది.
లివర్ ని కాపాడుతుంది
ఆరెంజ్ పీల్ శరీరంలో చేరిన విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. లివర్ శుభ్రతకు ఇది సహాయపడుతుంది.
బీపీ ని కంట్రోల్ చేస్తుంది
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలకు విశ్రాంతి చేకూర్చి బీపీ కంట్రోల్ లో ఉండటంలో సహాయపడతాయి. హార్ట్ హెల్త్ కి మేలు చేస్తుంది.
బరువు తగ్గిస్తుంది
ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తక్కువ తిన్నా ఎక్కువ తృప్తి కలుగుతుంది. ఇలా ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
మౌత్ హెల్త్‌కు మేలు చేస్తుంది
బ్యాక్టీరియాను నివారించే లక్షణాలతో ఉండి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఈ తొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.