విటమిన్ సి అధికం

లెమన్ పీల్ లో విటమిన్ సి అధికంగా ఉండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇంకా చర్మ కాంతిని కూడా పెంచుతుంది, దినచర్యలో చేర్చితే బెటర్ రిజల్ట్ ఉంటుంది.

డిటాక్స్ గుణాలు 

లెమన్ పీల్ లో నాచురల్ డిటాక్స్ గుణాలున్నాయి. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించేందుకు సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. 

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

లెమన్ పీల్ లో ఉన్న ఫ్లావనాయిడ్లు, పెక్టిన్ వంటి పదార్థాలు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

దంత సమస్యలను తగ్గిస్తుంది 

లెమన్ పీల్ ను దంతాలపై రబ్ చేయడం వలన దంతాలలోని బ్యాక్టీరియాను తగ్గించవచ్చు. ఇంకా దంతాల మురికిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

చర్మ కాంతిని పెంచుతుంది 

లెమన్ పీల్ లోని యాసిడ్ చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

బరువు తగ్గిస్తుంది 

లెమన్ పీల్ లోని పెక్టిన్ ఫైబర్ ఆకలి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెటబాలిజం వేగాన్ని పెంచి బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది.

క్యాన్సర్‌ నిరోధిస్తుంది 

లెమన్ పీల్ లో లిమోనిన్స్, డి-లిమోనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండి క్యాన్సర్‌ కారక కణాల పెరుగుదలని నిరోధిస్తాయి.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది 

లెమన్ పీల్ లోని నాచురల్ ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు తగ్గుతాయి.

శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది  

లెమన్ పీల్ లోని వాసన శ్వాసనాళాలకు ఉపశమనం ఇస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.