స్పిరులినా అనేది బ్లూ అండ్ గ్రీన్ ఆల్గే. ఇది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన సూపర్ ఫుడ్. ఇది రక్తశుద్ధికి, ఇమ్యూనిటీ పెరిగేందుకు సహాయపడుతుంది.
మునగాకులో ఎక్కువగా ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇది ఎముకల బలానికి, రక్తహీనత నివారణకు, రోగనిరోధక శక్తి పెంపు కోసం అద్భుతమైన ఆహారం.
ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే చియా సీడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ నీటిలో నానబెట్టిన చియా తింటే బరువు తగ్గుతారు.
ఇది మంచి బ్యాక్టీరియాను పెంచి, గట్ హెల్త్ మెరుగుపరుస్తాయి. పెరుగు, కాంబుచా, కిమ్చీ లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ జీర్ణవ్యవస్థ బలోపేతానికి, మెరుగైన ఇమ్యూనిటీకి ఉపయోగపడతాయి.
ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికంగా ఉండే అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రోజుకు 1 టీస్పూన్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.
అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉండే ఈ పండ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మెమోరీ బలపరుస్తాయి. వీటిని రోజూ తింటే చర్మ ఆరోగ్యానికి, శక్తివంతమైన మెదడుకు సహాయపడతాయి.
తేనె సహజమైన యాంటీబయోటిక్. ఇది ఇమ్యూనిటీ పెంచి, జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే, జీర్ణవ్యవస్థకు మంచిది. కృత్రిమ చక్కెరకు బదులుగా తేనె వాడండి.
ఇది హై ప్రోటీన్ కలిగిన గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. కీటో, వెయిట్ లాస్ డైట్లో చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి కావాల్సిన అన్ని ముఖ్యమైన అమినో ఆమ్లాలను అందిస్తుంది.
హల్దీలో ఉండే కర్క్యుమిన్ శరీరానికి అధిక రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది శరీరంలోని మంటలను తగ్గించేందుకు, క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది.
బాదం, వాల్‌నట్స్, పంప్కిన్ సీడ్స్ వంటివి ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ E అధికంగా కలిగి ఉంటాయి. ఇవి గుండెకి ఆరోగ్యాన్ని, మెదడుకు మెమరీని, శరీరానికి శక్తిని అందిస్తాయి