ఆరోగ్యంగా ఉండటం అంటే మందుల మీద ఆధారపడటం కాదు, రోజువారీ చిన్న అలవాట్లతో శరీరాన్ని రక్షించుకోవడమే అసలైన రహస్యం.
ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, రోజూ కాస్త కదలిక ఇవన్నీ కలిసి పెద్ద వ్యాధులకు బలమైన కవచంలా పనిచేస్తాయి.
వ్యాయామం అంటే కేవలం జిమ్ చేయటం మాత్రమే కాదు, నడక, మెట్లు ఎక్కడం, శరీరాన్ని రోజూ చురుకుగా ఉంచడం కూడా ఆరోగ్యమే.
సమయానికి తినడం, మితంగా తినటం వల్ల షుగర్, బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, హైజీన్ ఉండటం అనేది చిన్న అలవాటు అయినా ఎన్నో రకాల పెద్ద వ్యాధులను దూరం చేస్తుంది
మానసిక ఆరోగ్యం పట్టించుకోకపోతే శరీరం కూడా క్రమంగా బలహీనమవుతుంది, కాబట్టి ఒత్తిడిని నియంత్రించడం చాలా ముఖ్యం.
సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మెల్లగా శరీరాన్ని నాశనం చేస్తాయి, ఇవి తగ్గిస్తే జీవితమే మారిపోతుంది
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకోసం సరిపడా నీరు తాగాలి దానివల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది రోగనిరోధక శక్తి కూడా సహజంగా బలపడుతుంది.
చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో రాబోయే పెద్ద వ్యాధులు ముందే ఆగిపోతాయి.
ఈరోజు తీసుకునే జాగ్రత్తలే రేపటి ఆరోగ్యానికి భరోసా, కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే కేర్ తీసుకోవటం మొదలుపెట్టండి.