బడ్జెట్ ప్లాన్

ప్రతినెలా ఖర్చుల లిస్టు తయారు చేసుకుని ఖర్చు పరిమితి పెట్టుకోండి. అనవసర ఖర్చులు తగ్గించి ఆదా చేసిన డబ్బును పొదుపు చేయండి.

50/30/20 నియమం 

మీ ఆదాయాన్ని 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపుకు కేటాయించండి. ఈ విధంగా చేసే పొదుపు సులభం అవుతుంది. 

ఆటోమేటిక్ సేవింగ్స్

ప్రతి నెలా ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి సేవింగ్స్ ఖాతాలోకి ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండి.  

కొనుగోలు ముందు ఆలోచన 

ఏదైనా కొనేముందు 24 గంటలు ఆగండి. నిజంగా అది అవసరమా లేక కోరిక మాత్రమేనా అని ఆలోచించండి.

డిస్కౌంట్స్ వాడండి

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌లో డిస్కౌంట్స్, కూపన్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను వాడి డబ్బు ఆదా చేయండి.  

చిల్లరను పొదుపు చేయండి 

రోజు చివర్లో మిగిలిన చిన్న చిల్లరను పిగ్గీ బ్యాంక్ లో వేయండి. చిన్న మొత్తాలు కూడా చివరికి పెద్ద మొత్తంగా మారతాయి.

అవసరాలు vs కోరికలు 

మీ అవసరాలు, కోరికలను గుర్తించండి. అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చి, అనవసర కోరికలను తగ్గించండి. 

రీసైకిల్ 

పాత వస్తువులను రీసైకిల్ చేయండి. అలా చేయటం వల్ల కొత్తవి కొనకుండా డబ్బు ఆదా అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్తదనం కనపడుతుంది 

లక్ష్యం పెట్టుకోండి 

క్లియర్ పొదుపు లక్ష్యం పెట్టుకుని దాని కోసం సేవ్ చేయండి. ఇది మీకు ప్రోత్సాహాన్ని, ప్రణాళికనూ ఇస్తుంది. 

ఫ్రీ ఎంటర్తైన్మెంట్  

కాస్ట్‌లీ ఎంటర్తైన్మెంట్ కన్నా ఫ్రీ లేదా తక్కువ ఖర్చుతో ఉండే ఎంటర్తైన్మెంట్ ని ఎంచుకోండి. ఇది మీ బడ్జెట్‌ను సేవ్ చేస్తుంది.