హైపర్‌టెన్షన్  

రక్తపోటు పెరుగుతున్నా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి.

టైప్ 2 మధుమేహం 

చికాకు, దాహం ఎక్కువగా ఉన్నా గుర్తించకపోవచ్చు. గుండె, కిడ్నీలు, కనురెప్పలకు ప్రమాదం. బ్లడ్ షుగర్ టెస్ట్‌లు తప్పనిసరి. 

ఫ్యాటీ లివర్ 

కడుపు ఒత్తిడిగా అనిపించకపోతే పెద్దగా గుర్తించరు. చివరి దశలో లివర్ పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి.

అస్టియోపోరోసిస్  

ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి. ఎముక విరిగే వరకూ బాహ్య లక్షణాలు ఉండవు. క్యాల్షియం, విటమిన్ D తగినంత తీసుకోవాలి. 

మూత్రపిండ వ్యాధి 

కిడ్నీలు దెబ్బతినేవరకు పెద్దగా లక్షణాలు ఉండవు. దాహం, అలసట ఉంటుంది. కిడ్నీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ 

ఆల్కహాల్ తాగకపోయినా లివర్‌లో కొవ్వు పేరుకుంటుంది. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు ఉండవు. క్రమం తప్పకుండా లివర్ పరీక్షలు చేయించుకోవాలి. 

గ్లకోమా 

ప్రారంభంలో ఎలాంటి బాధ ఉండదు. కానీ, మెల్లగా కంటి చూపు కోల్పోతుంది. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు తప్పనిసరి. 

స్టమక్ క్యాన్సర్ 

పెరిగిపోయే వరకు పెద్దగా లక్షణాలు ఉండవు. అస్వస్థత, ఆకలి కోల్పోవడం జరుగుతుంది. అందుకే, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

మెలనోమా  

చర్మంపై చిన్న మచ్చలుగా మొదలవుతుంది. తొందరగా గుర్తించకపోతే ప్రాణాంతకమవుతుంది. సన్‌స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోవాలి. 

లంగ్ క్యాన్సర్ 

ఇది ఎక్కువగా పొగత్రాగేవారిలో కనబడుతుంది. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు ఉండవు. నొప్పి, శ్వాసకోశ సమస్యలు వచ్చేప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది.