తీవ్రమైన అలసట 

ఐరన్ లోపం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక అలసట ఎక్కువగా ఉంటుంది. రోజంతా విశ్రాంతిగా ఉన్నా నీరసం, అలసట కలుగుతుంది.

చర్మం పాలిపోవటం 

ఐరన్ తగ్గిపోతే హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. దాంతో చర్మం పచ్చగా లేదా తెల్లగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖం, అరచేతులు.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది  

ఐరన్ తక్కువైతే శరీరం ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో చిన్న పని చేసినా ఊపిరి పీల్చటం కష్టంగా మారుతుంది.

గుండె వేగంగా కొట్టుకోవడం  

హిమోగ్లోబిన్ తగ్గితే గుండె మరింతగా పని చేస్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం లేదా గుండె దడ ఎక్కువవుతుంది.

తల తిరగడం, తలనొప్పి 

రక్తంలో ఆక్సిజన్ సరైనగా లేకపోవడం వల్ల తల తిరగడం, తలనొప్పులు తరచుగా ఉంటాయి. ఇది నిద్రలోపం లాంటి సమస్యలకు దారి తీస్తుంది.

చర్మం ముడతలు పడడం

ఐరన్ లోపం వల్ల వెంట్రుకలు బలహీనంగా మారి రాలిపోవడం, చర్మం పొడిగా మారి ముడుతలు పడటం జరుగుతుంది. 

చేతులు, కాళ్లు చల్లబడటం 

రక్త ప్రసరణ సరైనగా లేకపోతే చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా అనిపిస్తాయి. ఇది ఐరన్ లోపం సంకేతంగా ఉంటుంది.

గోర్లు  బలహీనంగా మారడం  

ఐరన్ తక్కువైతే  గోర్లు బలహీనంగా మారి తెగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు గోర్లు ఉబ్బినట్లు లేదా లోపలికి వంగినట్లు కనిపించవచ్చు 

ఆకలి తగ్గిపోవడం  

శరీరంలో తగిన శక్తి లేకపోతే ఆకలి తగ్గుతుంది. క్రమంగా భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి.

ఒత్తిడికి లోనవ్వడం 

ఐరన్ లోపం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చిరాకు, నిరాశ, ఒత్తిడికి లోనవ్వడం సాధారణం.