సరైన కమ్యూనికేషన్ అనేది హెల్దీ రిలేషన్ షిప్ కి పునాది. పార్టనర్స్ ఇద్దరూ తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా ఒకరికొకరు వ్యక్తీకరించుకోవచ్చు, దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయి.
ఆరోగ్యకరమైన సంబంధంలో పరస్పర గౌరవం చాలా ముఖ్యం. భాగాస్థులిద్దరూ తమ ఆలోచనలు, భావాలను విలువను ఇచ్చి పుచ్చుకోవాలి.
నమ్మకం మరియు నిజాయితీ ఆరోగ్యకరమైన సంబంధంలో ముఖ్యమైన భాగాలు. భాగస్వాములు ఒకరితో ఒకరు ట్రాన్స్పరెన్సీతో మెలగాలి. అప్పుడే వారి రిలేషన్ బాగుంటుంది.
హెల్దీ రిలేషన్ లో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. భాగస్వాములు తమ సొంత భావోద్వేగాలను గుర్తించి, అర్థం చేసుకోవాలి. ఇది సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది.
రిలేషన్ లో అప్పడప్పుడూ వచ్చే సమస్యలని సామరస్యంతో పరిష్కరించుకోవాలి. అంతేకాని అనవసరంగా ఒకరినొకరు నిందించటం, విమర్శించడం వంటివి చేయకూడదు.
భాగస్వాములు వారి సొంత అభిప్రాయాలని వ్యక్తపరిచే స్వాతంత్రం ఉండాలి. ఒకానొక దశలో స్నేహితుల్లా మెలగాలి. అప్పుడే తాము అనుకొన్న లక్ష్యాలు సాధిస్తారు.
భాగస్వాములు ఒకరికొకరు ప్రోత్సాహం, ఓదార్పు మరియు భరోసాను కనబరుస్తూ ఉండాలి. ఒకరి విజయాలను ఒకరు సెలెబ్రేట్ చేసుకోవాలి. ప్రతీ విషయంలోనూ బెస్ట్ సపోర్ట్ ని అందిస్తూ ఉండాలి.
భాగస్వాములు రోజువారీ పనులు, ఆర్థిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్వహించడానికి ఇద్దరూ కలిసి పనిచేయాలి. వారి బాధ్యతలలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి.
డేట్ నైట్‌లు, రొమాంటిక్ టూర్స్ వంటి అఫెక్షన్ తో కూడుకొన్న ఎమోషన్స్ కి అప్పుడప్పుడూ టైం స్పెండ్ చేయాలి. అప్పుడు సంతృప్తికరమైన శారీరక సంబంధాన్ని అనుభవిస్తారు.
ఆరోగ్యకరమైన సంబంధంలో వ్యక్తిగత పెరుగుదల మరియు అభివృద్ధి చాలా అవసరం. ఒకరి విజయాలను ఒకరు జరుపుకోవాలి. మరియు ఒకరికొకరు వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి సహాయం చేయాలి.