తేనె నిమ్మరసం

రోజూ పరగడుపున తేనెలో నిమ్మరసం పిండుకొని తాగితే శరీర వేడిని తగ్గిస్తుంది. అలానే శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.

కోకోనట్ వాటర్ 

కోకోనట్ వాటర్ సహజంగా శరీరాన్ని కూల్ చేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ లను సమతుల్యం చేస్తూ వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

బటర్ మిల్క్ 

బటర్ మిల్క్ శరీరానికి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తూ శరీర వేడిని తగ్గిస్తుంది. 

గంజి  

అన్నం ఉడికించిన గంజి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. వెదర్ హాట్ గా ఉన్నప్పుడు బాడీకి ఇన్స్టంట్ కూలింగ్ ని అందిస్తుంది.

కీర దోస

కీర దోసను సలాడ్‌లలో తీసుకుంటే శరీర వేడిని తగ్గిస్తుంది. దీనిలో ఎక్కువగా నీరుండే గుణం ఉండటం వల్ల ఇది చల్లదనాన్ని ఇస్తుంది.

పాలకూర జ్యూస్  

పాలకూరలో ఉండే ఐరన్, మినరల్స్ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. పాలకూర జ్యూస్ వేసవిలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఆమ్లా జ్యూస్

ఆమ్లాలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీర వేడిని తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సబ్జా సీడ్స్ 

పాలు లేదా నీటిలో కొన్ని సబ్జా సీడ్స్ వేసుకొని తాగితే శరీర వేడి తగ్గుతుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ శీతలతను కలిగిస్తాయి.