పళ్లపై పసుపు రంగు ఎందుకు పడుతుంది?

పళ్లపై పసుపు రంగు ఎక్కువగా టీ, కాఫీ, పాన్, పొగాకు, కుళ్ళిన ఆహారాల వల్ల ఏర్పడుతుంది. ఇది అందాన్ని, నమ్మకాన్ని తగ్గించి ముఖంలోని నవ్వును పాడు చేస్తుంది.

నిమ్మరసం మ్యాజిక్

రోజూ బ్రష్ చేసిన తర్వాత, నిమ్మరసంలో ఉప్పు కలిపి పళ్లపై రుద్దితే, పసుపురంగు పోయి, దంతాలు మెరిసిపోతాయి. ఈ పద్ధతి సులభమైనది, ఇంట్లోనే ప్రయత్నించవచ్చు.

బేకింగ్ సోడా పవర్ 

బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ చేసి, వారానికి రెండుసార్లు పళ్లపై రుద్దితే, పసుపు మరకలు తొలగిపోయి, తెల్లదంతాలు మీ నవ్వును మరింత అందంగా చేస్తాయి.

అరటిపండు తొక్క అద్భుతం

అరటిపండు తొక్కలో ఉండే పోషకాలు, ఖనిజాలు పళ్లపై రుద్దితే, పసుపు మరకలు తొలగి తెల్లగా మారతాయి. ప్రతిరోజూ ఉదయం ఇలా చేస్తే, మంచి ఫలితం ఉంటుంది 

కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ 

కొబ్బరినూనెతో ప్రతిరోజూ 5 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేస్తే పళ్లపై పసుపు మరకలు తొలగిపోతాయి. నోటిలో బ్యాక్టీరియా తగ్గి, శ్వాస కూడా స్వచ్ఛంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు సహజమైన క్లీనర్ 

స్ట్రాబెర్రీని పేస్ట్‌గా చేసి పళ్లపై రుద్దితే పసుపు మరకలు తొలగుతాయి. స్ట్రాబెర్రీలో ఉండే యాసిడ్ సహజంగా పళ్లను తెల్లబారేలా చేస్తుంది.

ఆపిల్ సైడర్ వినెగర్ ప్రభావం

కొద్దిగా ఆపిల్ సైడర్ వినెగర్ నీళ్లలో కలిపి పళ్లను శుభ్రం చేస్తే, పసుపు రంగు తొలగిపోయి, మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి.

ఆరెంజ్ తొక్కతో చికిత్స 

ఎండిన నారింజ తొక్క పొడితో బ్రష్ చేస్తే పసుపు మరకలు తొలగిపోతాయి. నారింజలోని విటమిన్ C పళ్లకు తెల్లదనాన్ని అందిస్తుంది.

తులసి ఆకుల గుణం 

తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేసి, పళ్లకు పేస్ట్‌గా రాస్తే పసుపు మరకలు తొలగిపోతాయి. ఇది సహజమైన వైద్య పద్ధతి కూడా.