తులసి ఆకులను నీటిలో మరిగించి తేనెతో కలిపి తాగండి. ఇది జలుబును తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అల్లం ముక్కలు, మిరియాలను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి తగ్గి శరీరం వేడిగా ఉంటుంది.
గోరువెచ్చని పాలలో పసుపు, తేనె కలిపి తాగితే శరీరంలో వేడి విపరీతంగా పెరిగి, జలుబు త్వరగా తగ్గుతుంది.
వేప ఆకులు మరిగించిన నీటి ఆవిరిని పీల్చితే ముక్కు దిబ్బడ తగ్గి ఊపిరి సులభంగా పీల్చగలుగుతారు.
లవంగం, యాలకులు కలిపిన టీని తాగితే గొంతులో కఫం తగ్గి, జలుబు చాలా త్వరగా మాయమవుతుంది
వెల్లుల్లిని మెత్తగా మెదిపి తేనెతో కలిపి తింటే శరీరంలో వేడి పెరిగి జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తేనెతో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం పొందుతారు.
గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గి జలుబు త్వరగా తగ్గుతుంది.
తేనెతో మిరియాల పొడి కలిపి తింటే శరీరంలో వేడి పెరిగి జలుబు, కఫం త్వరగా తగ్గుతాయి.
అలసంద పౌడర్‌ను నీటిలో కలిపి తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.