హెల్ధీ హార్ట్
ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది.
వెయిట్ మేనేజ్మెంట్
ఎక్కువసేపు తృప్తి కలిగించే ఆహారం కావడంతో ఆకలిని తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఓట్స్ డయాబెటీస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి.
డైజేషన్ ఫ్రీ
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగటంతో మలబద్ధకం తగ్గుతుంది.
ఎనర్జీని ఎక్కువగా ఇస్తుంది
ఉదయం తిన్న ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రోజంతా శక్తిని ఇస్తాయి.
చర్మానికి మేలుచేస్తుంది
ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి ముడతలను తగ్గిస్తాయి.
ఇమ్యూనిటీని బలపరుస్తుంది
ఓట్స్‌లో విటమిన్‌లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బ్లడ్ ప్రెజర్ కంట్రోల్
వీటిని రెగ్యులర్‌గా తింటే రక్తపోటు నియంత్రణలో ఉంచి హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది.
డైట్‌లో భాగం
ఓట్స్‌తో స్మూతీ, పాయసం, ఉప్మా లేదా దోశ వంటివి ఎంతో తేలికగా తయారు చేయవచ్చు. రుచికి రుచి… ఆరోగ్యానికి ఆరోగ్యం.
బెస్ట్ ఆప్షన్
పోషకాలు, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది అన్ని వయసుల వారికి సరైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అవుతుంది.