నోరు ఎండిపోవడం

నోరు ఎప్పుడూ పొడిగా అనిపించడం, తేమ తగ్గడం వంటివి నీటి కొరతకు తొలి సూచన. మీరు డీహైడ్రేషన్ కి గురయ్యారని అర్ధం.

చర్మం పొడిబారడం

నీళ్లు తక్కువగా తాగితే చర్మం తేలికగా పొడిగా మారుతుంది. సాగినట్లు అనిపిస్తుంది. మెరుపు తగ్గి పోతుంది.  

తలనొప్పి రావడం

డీహైడ్రేషన్ వల్ల నీరసం ఎక్కువవుతుంది. మెదడులో ద్రవాల సమతుల్యత తగ్గి తలనొప్పి వస్తుంది.

మూత్రం రంగు మారడం

మీ మూత్రం గాఢమైన పసుపు లేదా నారింజ రంగులో ఉంటే అది ఖచ్చితంగా నీటి లోపం ఉన్నట్లు సూచన.

అలసట, బలహీనత

శరీరంలో ద్రవాలు తగ్గితే శక్తి ఉత్పత్తి తగ్గి అలసి పోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పెదవులు పొడిబారడం  

శరీరంలో వాటర్ పర్సంటేజ్ తగ్గితే, పెదవులు పొడిబారి పోయి ఎక్కువగా చిట్లిపోతూ ఉంటాయి.  

మలబద్ధకం 

జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి నీరు అవసరం. అలాంటి నీటిని తక్కువ తాగితే మలబద్ధకం సమస్య వస్తుంది.  

గుండె వేగం పెరగడం 

డీహైడ్రేషన్ వల్ల శరీరానికి అవసరమయ్యే రక్తప్రసరణ స్లోగా జరుగుతుంది. దీంతో హార్ట్‌రేట్ పెరిగే అవకాశం ఉంది.

మూత్రం వాసన మారడం 

నీరు తక్కువగా తాగితే మూత్రంలో వ్యర్థాలు ఎక్కువగా చేరి  దుర్వాసన వస్తుంది. అంటే బురద వాసనతో కూడిన మూత్రం వస్తుంది.

దృష్టి లోపం పెరగడం  

మన శరీరంలో నీరు లోపిస్తే మెదడు ఫంక్షన్ తగ్గిపోయి, దృష్టి సారించడం కష్టం అవుతుంది.