మన ఆరోగ్యంపై మైక్రోప్లాస్టిక్స్  ముప్పు!

ఏమిటీ మైక్రోప్లాస్టిక్స్?

5 మిల్లీమీటర్లకంటే తక్కువగా ఉండే చిన్న ప్లాస్టిక్ కణాలు భూమి లోపలికి, సముద్ర జలాల్లోనూ కలిసిపోయి, తిరిగి అవి మన ఆహార వ్యవస్థలోకి ప్రవేశించి మన ఆరోగ్యానికి హాని కలిగించేవి.

ఆహారంలోకి మైక్రోప్లాస్టిక్స్

కంటికి కనిపించని ఈ కణాలు నీరు, సముద్ర ఆహారం, ఉప్పు, తేనె, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.

మన శరీరంలో మైక్రోప్లాస్టిక్స్

చిన్న కణాలు రక్తప్రసరణ వ్యవస్థలోకి చేరి శరీరంలోని వివిధ అవయవాల్లో నిలిచిపోతాయి. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు.

ఆరోగ్యంపై ప్రభావం 

ఈ ప్లాస్టిక్ కణాలు మానవ శరీరంలో చేరిన తర్వాత రక్తపోటు, గుండె సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులను కలిగించే ప్రమాదం ఉంది.

హార్మోన్లపై ప్రభావం 

మైక్రోప్లాస్టిక్‌ విషతుల్య రసాయనాలు విడుదల చేస్తాయి. ఇవి శరీర హార్మోన్లను ప్రభావితం చేసి మూత్రపిండాలు, గర్భాశయం, మెదడు పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది.

గర్భిణీల ఆరోగ్యానికి ముప్పు  

గర్భిణీల రక్తంలో మైక్రోప్లాస్టిక్‌లు చేరితే పిండం ఎదుగుదల ప్రభావితమవుతుంది. శిశువు జననంలో లోపాలు రావచ్చు. గర్భస్రావ ప్రమాదం కూడా పెరుగుతుంది.

ప్రజల్లో పెరుగుతున్న మైక్రోప్లాస్టిక్స్ 

రోజూ మనం 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ను ఆహారంలో తీసుకుంటున్నామని పరిశోధనలు చెబుతున్నాయి. దీని ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశముంది.

పరిసరాల్లో మైక్రోప్లాస్టిక్స్ 

ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం, నదులు, నేల ద్వారా మన వ్యవసాయ భూములను కూడా కలుషితం చేస్తున్నాయి. దీని ప్రభావం భవిష్యత్తు తరాలకు ముప్పుగా మారుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించాలి. ఫిల్టర్ నీటిని తాగాలి. ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా పరిష్కారం సాధ్యమే.

భవిష్యత్తుకు మార్గం

పరిసరాలను రక్షించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జీవపదార్థాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఈ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, భవిష్యత్తు తరాలకు రక్షణ కూడా.