విటమిన్ డి తో కూడిన ఆహారం

మెగ్నీషియం అబ్జార్ప్షన్ కి విటమిన్ డి కీలకం. సూర్యకాంతి, గుడ్డులో పచ్చసొన, ఫ్యాటీ ఫిష్ తీసుకుంటే మెగ్నీషియం శరీరంలో బాగా పని చేస్తుంది. 

బొప్పాయి లేదా నారింజ పండ్లు 

విటమిన్ C ఉన్న పండ్లు మెగ్నీషియంను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బొప్పాయి, నారింజ పండు జ్యూస్ తాగడం మంచిది.

పచ్చి ఆకుకూరలు 

పాలకూర వంటి ఆకుకూరల్లో  మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని ఇతర పోషక ఆహారాలతో కలిపి తింటే శోషణ మెరుగవుతుంది.

ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం 

చికెన్, పన్నీర్, బీన్స్ వంటి ప్రోటీన్ ఫుడ్స్‌తో మెగ్నీషియం తీసుకుంటే శరీరానికి మంచి ఉపయోగం ఉంటుంది.

బ్రౌన్ రైస్ లేదా క్వినోవా 

ఫైబర్ మరియు మాగ్నీషియం కలిగిన బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు శోషణను మెరుగుపరుస్తాయి.

బాదం మరియు వాల్‌నట్ 

వీటిలో మెగ్నీషియం‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి శరీర శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి. 

జీడిపప్పు మరియు పిస్తా  

వీటిని ముద్దలుగా తినడం వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం తక్కువ సమయంలో అందుతుంది. 

పాలు మరియు పాల ఉత్పత్తులు  

కాల్షియం మరియు విటమిన్ డి కలిగి ఉండే పాలు మరియు పాల ఉత్పత్తులు మెగ్నీషియం శోషణలో సహాయపడతాయి. 

అరటికాయలు 

పొటాషియం మరియు మెగ్నీషియం కలిగి ఉండే అరటికాయలు శరీర శోషణ సామర్థ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి.

నీరు తగిన మోతాదులో త్రాగడం 

మెగ్నీషియం శోషణకు శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం.