లంచ్ చేసిన తర్వాత అకస్మాత్తుగా నిద్ర మత్తు రావటం చాలా మందికి సాధారణ సమస్య ఇది శరీరంలో జరిగే సహజ రసాయన మార్పుల వల్ల జరుగుతుంది.
మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి శరీరం ఎక్కువగా శక్తిని కడుపు వైపు మళ్లిస్తుంది అందుకే ఆ టైంలో బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో అవుతుంది.
ఎపుడైతే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువవుతుందో అప్పుడు అలసట పెరుగుతుంది దాంతో మనకు నిద్ర మత్తు వచ్చినట్టు అనిపిస్తుంది.
ప్రత్యేకంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న భోజనం చేసినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి అది నిద్రను ప్రోత్సహించే హార్మోన్లను విడుదల చేస్తుంది.
ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు సెరోటోనిన్ మరియు మెలటోనిన్ హార్మోన్లు పెరిగి నిద్ర ముంచుకు వస్తుంది.
అవసరాన్ని మించి ఎక్కువగా తిన్నప్పుడు జీర్ణక్రియ ఎక్కువ సమయం తీసుకొంటుంది. దీంతో శరీరం అలసటగా మారి విశ్రాంతి అవసరం అనిపిస్తుంది.
లంచ్ టైమ్ తర్వాత మన శరీర సర్కేడియన్ రిథమ్ ప్రకారం సహజంగా ఎనర్జీ తగ్గుతుంది అందుకే మధ్యాహ్నం సమయంలో నిద్ర అనిపించడం సాధారణం.
పని మధ్యలో ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల కూడా రక్తప్రసరణ తగ్గి అలసట పెరిగి నిద్రగా అనిపించే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ సమస్యను తగ్గించాలంటే తేలికపాటి భోజనం తీసుకోవడం మంచిది ప్రత్యేకంగా ఎక్కువగా కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండాలి.
భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు వాకింగ్ చేయడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే నిద్ర మత్తును తగ్గిస్తుంది.
పుష్కలంగా నీళ్లు తాగడం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి అలసటను తగ్గిస్తుంది ఇది మధ్యాహ్నం నిద్ర మత్తును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
వర్కింగ్ టైంలో షార్ట్ బ్రేక్స్ ఇవ్వడం, మధ్యలో లేచి కదలడం వంటి పనులవల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరం మళ్లీ యాక్టివ్ గా మారుతుంది.
కాఫీ లేదా గ్రీన్ టీ మితంగా తీసుకోవడం అలసటను తగ్గిస్తుంది కానీ అధికంగా తీసుకుంటే రాత్రి నిద్రపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మధ్యాహ్నం సమయంలో చిన్న పవర్ నాప్ తీసుకోవడం కూడా కొంతమందికి సహాయపడుతుంది కానీ అది ఎక్కువసేపు ఉండకూడదు పది నుండి ఇరవై నిమిషాలు సరిపోతుంది
రోజూ సమయానికి నిద్రపోవడం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల మధ్యాహ్నం నిద్ర మత్తు తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.