ఒక రోజు నిద్ర లేకపోతే మీ మెదడు ఫోకస్ తగ్గిపోతుంది, అలసట పెరుగుతుంది, చిన్న పనులు కూడా కష్టం అనిపించి రోజంతా చిరాకుగా కనిపిస్తుంది.
24 గంటలు నిద్ర లేకపోతే రియాక్షన్ టైమ్ తగ్గిపోతుంది, డ్రైవింగ్ ప్రమాదకరం అవుతుంది, నిర్ణయాలు తప్పుగా తీసుకునే అవకాశం పెరుగుతుంది శరీరం స్లో డౌన్ అవుతుంది.
ఒక వారం రోజులు నిద్ర తగ్గితే మీ ఇమ్యూనిటీ వీకవుతుంది, చిన్న జబ్బులు తరచుగా వస్తాయి, శరీరం రికవరీ స్లో అవుతుంది.
నిద్రలేమి వల్ల మీ మెమరీ దెబ్బతింటుంది, నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. వర్క్ మీద కాన్సంట్రేషన్ తగ్గుతుంది. రోజువారీ పనుల్లో తప్పులు పెరుగుతాయి.
రాత్రి సరైన నిద్ర లేకపోతే హార్మోన్ ఇమ్బ్యాలేన్స్ అవుతుంది. ఆకలి పెరుగుతుంది, ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఒక నెల నిద్రలేమి ఉంటే స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి, ఆందోళన పెరుగుతుంది, మానసిక స్థితి అస్తవ్యస్తం అవుతుంది. చిన్న విషయాలకే కోపం వస్తుంది.
నిద్రలేమి వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది, క్రానిక్ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
నిద్ర తక్కువగా ఉండటం వల్ల స్కిన్ గ్లో తగ్గుతుంది. కళ్ల చుట్టూ నలుపు పెరుగుతుంది. వృద్దాప్య చాయలు కనిపిస్తాయి.
ఒక సంవత్సరం నిద్రలేమి ఉంటే మెటబాలిజం తగ్గిపోతుంది, డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది, శరీరంలో ఫ్యాట్ నిల్వ ఎక్కువ అవుతుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
నిద్రలేమి వల్ల మీ ఎమోషనల్ కంట్రోల్ తగ్గిపోతుంది. రోజువారీ జీవితంలో చిన్న విషయాలకే బాధ పడటం, కోపం పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.
మెదడు టాక్సిన్స్ క్లీన్ చేయడానికి నిద్ర అవసరం, నిద్రలేమి ఉంటే ఈ ప్రక్రియ తగ్గిపోతుంది, దీర్ఘకాలంలో న్యూరోలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నిద్రలేమి వల్ల హార్మోన్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ మరియు ఇన్సులిన్ ఎఫెక్ట్. నిద్రలేమి శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది.
ఒక దశాబ్దం పాటు నిద్రలేమి ఉంటే గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి క్రానిక్ డిసీజెస్ పెరుగుతాయి. దీంతో లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది
నిద్రలేమి వల్ల మెదడుకి వేగంగా వృద్ధాప్యం వస్తుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
సరైన నిద్ర లేకపోతే మీ టోటల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, శరీరం, మనసు రెండూ బలహీనమై చివరికి ఆరోగ్యకరమైన జీవనం కష్టమవుతుంది.