జపాన్ ప్రజలు ఎక్కువగా ఫిష్, వెజిటబుల్స్, సి ఫుడ్ తింటారు. తక్కువ ఫ్యాట్, ఎక్కువ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ కావటం చేత వీరి ఆయుష్షును పెంచుతుంది.
జపనీస్ ప్రజలు ఎక్కువగా గ్రీన్ టీ తాగుతారు. ఇది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉండి హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
ఒకే సారి ఎక్కువగా తినకుండా 80% ఫుడ్ తో ఆగిపోతారు. దీనివల్ల ఇండైజేషన్ ప్రాబ్లెమ్స్ రాకుండా ఉంటాయి
వీళ్ళు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
జపాన్‌లో ప్రజలు రోజూ నడక, వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటారు. ఇది శరీర బలాన్ని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెడిటేషన్, యోగా, హాట్ స్ప్రింగ్స్ స్నానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటారు. దీని వలన ఆయురారోగ్యం పెరుగుతుంది.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడిపే సంప్రదాయం వీరికి ఉంది. ఇది మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
ప్రపంచంలోనే బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ జపాన్‌లో ఉంది. రెగ్యులర్ మెడికల్ చెకప్స్ తో వీళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
క్లీనింగ్ టెక్నాలజీ ద్వారా హై క్వాలిటీ వాటర్ ని తాగుతారు. ఇది బాడీ డీహైడ్రేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
జపాన్ ప్రజలు నేచురల్ ఎట్మాస్ఫియర్ లో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రకృతిలో జీవించడం ఆరోగ్యాన్ని మెరుగుపరచేలా ఉంటుంది.