రోజూ నడక శరీరానికి మంచిదే కానీ ముప్పై ఐదేళ్ల తర్వాత మహిళలకు ఒక్క నడక మాత్రమే పూర్తిగా సరిపోదు అనేది  నిజం.  3

నడక హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్  పెంచుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది కానీ మజిల్ స్ట్రెంత్ పెరగ డానికి పూర్తిగా సరిపోదు. 

ముప్పై ఐదేళ్ల తర్వాత హార్మోన్ మార్పులు ప్రారంభమవుతాయి అందుకే మహిళలు తమ రోజువారీ జీవితంలో స్ట్రెంత్ నిచ్చే వ్యాయామాలు తప్పనిసరిగా చేర్చాలి.

డైలీ వాకింగ్ వెయిట్ కంట్రోల్ కు సహాయపడుతుంది కానీ మెటాబాలిజం పెంచాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఎక్కువగా అవసరం 

ఎముకల దృఢత్వం తగ్గే వయసులో కేవలం నడక కంటే తేలికపాటి బరువులతో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

నడక మనసుకు ప్రశాంతత ఇస్తుంది నిద్ర మెరుగుపరుస్తుంది కానీ శరీర ఆకృతిని గణనీయంగా మార్చడానికి మాత్రం సరిపోదు. 

వారానికి కనీసం రెండు లేదా మూడు రోజులు బలం పెంచే వ్యాయామాలు చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి.

యోగ లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు నడకతో కలిపితే బాడీ రిలాక్సేషన్, బ్యాలెన్స్ మరియు ఫ్లెక్సిబిలిటీ గణనీయంగా మెరుగవుతాయి.

మహిళలు తమ ఆరోగ్య లక్ష్యాలను బట్టి వాకింగ్ చేసే సమయం, తీవ్రత మరియు వ్యాయామ విధానాన్ని సరిగా ప్లాన్ చేయాలి.

కాబట్టి రోజూ నడక మంచి ప్రారంభం మాత్రమే సంపూర్ణ ఆరోగ్యానికి వివిధ రకాల వ్యాయామాలు కలపడం నిజంగా అవసరం.