అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి పురుషుల ఆరోగ్యంలో దీర్ఘకాల సమస్యలకు నెమ్మదిగా కారణమవుతోంది 

ఈ ఆహారాల్లో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో పురుషులకు శక్తి, ఉత్సాహం, లైంగిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతాయి 

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుదల మెటబాలిజం సమస్యలు త్వరగా వస్తాయి ఇవి పురుషులలో ఎక్కువగా గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి 

ఈ ఆహారాలు పోషకాలు తక్కువగా ఉండి శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు తగ్గిస్తాయి దీంతో పురుషులకి దీర్ఘకాలంగా రోగనిరోధక శక్తి బలహీనమై తరచూ అనారోగ్యాలు వస్తాయి

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంతుంది. ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన సమస్యలు పెరుగుతాయి పురుషుల్లో నెమ్మదిగా రోజువారీ జీవనశైలిలో మార్పులు తెస్తాయి 

ఈ ఆహారాల్లో ఉండే కృత్రిమ రసాయనాలు శరీరంలో వాపు పెంచి దీర్ఘకాల రోగాలకు దారి తీస్తాయి వీటివల్ల  పురుషుల్లో ఎక్కువగా కాలేయం, గుండె, పేగుల సమస్యలు ఏర్పడతాయి 

తరచూ జంక్ ఫుడ్ తినడం వల్ల శుక్రకణాల నాణ్యత సంఖ్య తగ్గే ప్రమాదం ఉంటుంది దీంతో పురుషులలో ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది 

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అలవాటు నిద్ర నాణ్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సరైన విశ్రాంతి లేకపోవడం హార్మోన్లపై చెడు ప్రభావం చూపుతుంది పురుషులలో ఇది దీర్ఘకాలంగా కొనసాగుతుంది

బాల్యంలోనే ఈ ఆహారాలకు అలవాటు పడితే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి పురుషుల శారీరక సామర్థ్యం ఆయుష్షు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు 

తాజా సహజ ఆహారం ఎంచుకోవడం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం పురుషుల ఆరోగ్యానికి అత్యంత అవసరం ఇది శక్తి దీర్ఘాయుష్షు నాణ్యమైన జీవితం అందిస్తుంది