ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడం ద్వారా శరీరంలో కొవ్వును కరిగించేందుకు, మానసిక స్పష్టత పెంచేందుకు సహాయపడే పద్ధతిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.
పౌష్టికాహారం లేకుండా గడిపినపుడు, శరీరం నిల్వలో ఉన్న కొవ్వును శక్తిగా మార్చుకొని వేగంగా బరువు తగ్గుతుంది. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించి కొవ్వు నిల్వలను విడుదల చేయడంలో సహాయపడుతుంది. గ్రోత్ హార్మోన్ స్థాయిలు పెరిగి, కండరాలు బలంగా మారతాయి.
ఫాస్టింగ్ సమయంలో శరీరం సెల్ రిపేర్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. పాత, దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
ఫాస్టింగ్ కారణంగా హార్మోన్‌ల మార్పులు జరుగుతాయి. ఇది డీఎన్ఏ రిపేర్‌లో సహాయపడుతుంది. శరీర కణాలు పునరుజ్జీవనం చెంది యవ్వనంగా కనిపిస్తారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బ్రెయిన్ సెల్స్‌ను రక్షించడమే కాకుండా అల్జీమర్స్ వంటి నరాల సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది. మెమరీ శక్తిని పెంచుతుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కారణంగా శరీరంలో వ్యాధికారక బాక్టీరియా, వైరస్‌లను తగిలించుకునే అవకాశం తగ్గుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, టైప్ 2 డయాబెటిస్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్ స్థాయిలను సులభంగా నియంత్రించవచ్చు
16/8 ఫాస్టింగ్ పద్ధతితో ప్రారంభించండి. 16 గంటలు ఉపవాసం, 8 గంటలు ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని సమతుల్యంగా మార్చుకోవచ్చు.
శరీరానికి తగిన పోషకాలు అందేలా చూసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. మొదట తక్కువ సమయంతో ప్రారంభించి, క్రమంగా ఫాస్టింగ్ సమయాన్ని పెంచాలి.