లెమన్ వాటర్

లెమన్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ప్రతి రోజూ పరగడుపున లెమన్ వాటర్ తాగడం మంచిది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు. 

వామ్ వాటర్

వామ్ వాటర్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ ని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఉదయాన్నే తాగితే ఉత్తమం.

తులసి టీ

తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నేచురల్ గా కంట్రోల్ చేస్తుంది. అందుకే ప్రతిరోజూ ఈ టీ తాగడం మంచిది.

వాటర్‌మెలన్ జ్యూస్ 

వాటర్‌మెలన్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇంకా  యూరిక్ యాసిడ్‌ను తక్కువ చేస్తుంది. దీనిని వేసవిలో డైలీ తీసుకోవచ్చు.

మెంతి వాటర్ 

ముందుగా రాత్రి పూట మెంతి గింజలు నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

లెమన్ మిక్స్ చేసిన కోకోనట్ వాటర్ 

కోకోనట్ వాటర్ మరియు లెమన్ మిక్స్ చేసి తాగడం వల్ల శరీరానికి తేమని అందించటమే కాకుండా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొరియాండర్ వాటర్ 

కొరియాండర్ వాటర్ మూత్ర విసర్జనను ప్రోత్సహించి శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది నేచురల్ డయూరిటిక్స్ గా పనిచేస్తుంది.