తేనే
ఒక టీస్పూన్ తేనెను రోజూ రాత్రి నిద్రకు ముందు తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. తేనెలోని సహజ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గొంతును ఫ్రీ చేస్తాయి.
అల్లం టీ
1-2 ముక్కల అల్లాన్ని మరిగించిన నీటిలో ఉంచి, దానితో టీ తయారు చేసి తాగడం వల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాన్ని ఫ్రీ చేస్తుంది.
వేపాకులు
కొన్ని వేపాకులను వేడి నీటిలో వేసి మరిగించి, రోజుకి రెండు సార్లు తీసుకోవడం వల్ల శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది.
నిమ్మరసం+ తేనె
1 టీస్పూన్ నిమ్మరసం + తేనె కలిపి తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గి థ్రోట్ ఫ్రీ అవుతుంది.
వెల్లుల్లి
1-2 వెల్లుల్లి రెమ్మలని నేరుగా లేదా ఉడికించిన నీటితో తీసుకోవడం వల్ల శ్వాసనాళం బ్యాక్టీరియా నుండి రక్షణ పొందుతుంది.
సాల్ట్ వాటర్ గార్గిల్
1 గ్లాసు వేడి నీటిలో ½ టీస్పూన్ ఉప్పు కలిపి రోజులో 2–3 సార్లు గార్గిల్ చేయడం వల్ల గొంతు నొప్పి మరియు వాపు తగ్గుతుంది.
ఆవిరి పీల్చడం
మీ ముక్క మరియు గొంతుకి 5–10 నిమిషాలపాటు వేడి నీటి ఆవిరి పట్టటం వల్ల గొంతు, శ్వాసనాళాలు హైడ్రేట్ అయ్యి దగ్గు తగ్గుతుంది.
టర్మరిక్ మిల్క్
ఒక గ్లాసు వేడి పాలు + ½ టీ స్పూన్ పసుపు + ¼ టీ స్పూన్ మిరియాల పొడి కలిపి తాగడం వల్ల పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాతో దగ్గు తగ్గుతుంది.