అవిసె గింజలు

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉండే అవిసె గింజలు జీర్ణక్రియని మెరుగుపరిచి, బరువు తగ్గే వారికి సహాయపడతాయి.

ఓట్స్  

ఓట్స్‌లో ఉన్న సొల్యూబుల్ ఫైబర్ కోలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ తినడం ఆరోగ్యకరమైన ఆరంభం అవుతుంది.

గోధుమ రొట్టెలు 

గోధుమల్లో ఉన్న ఇన్సొల్యూబుల్ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది.

బాజ్రా 

గోధుమల్లో ఉన్న ఇన్సొల్యూబుల్ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది.

పాలకూర

పాలకూరలో ఉన్న ఫైబర్, ఐరన్, విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం. ఇది జీర్ణవ్యవస్థను శక్తివంతంగా ఉంచుతుంది.

ముల్లంగి

ముల్లంగి తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. కడుపు నిండుగా ఉండే ఫీలింగ్ ఇస్తుంది మరియు మలబద్ధకం తగ్గిస్తుంది.

శనగలు  

శనగలలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తశుద్ధి చేస్తాయి. గ్లూకోజ్ ని నియంత్రణలో ఉంచుతాయి.

కీరదోస 

కీరదోస నీరు మరియు ఫైబర్‌తో నిండివుంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో, జీర్ణక్రియ మెరుగుపరిచేలా సహాయపడుతుంది.

గుమ్మడికాయ 

గుమ్మడికాయలో ఉండే ఫైబర్ మలమూత్ర సమస్యలు నివారిస్తుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

జామకాయ  

జామకాయ విటమిన్ C మరియు ఫైబర్‌తో నిండినవి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి.