సోంపులో ఉన్న నేచురల్ ఆయిల్స్ డైజేషన్ ను మెరుగుపరచడంతో పాటు గ్యాస్, మలబద్దకాన్ని తగ్గిస్తాయి. భోజనం తరువాత తీసుకోవడం వల్ల వెంటనే రిలీఫ్ లభిస్తుంది.
సోంపు తినడం ద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇది నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్‌లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా గ్రోత్‌ను కూడా నిరోధిస్తుంది.
సోంపులోని యాంటీఆక్సిడెంట్లు శ్వాసనాళాలను శుభ్రం చేసి ఆస్థమా, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి
సోంపు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది లివర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇందులో ఐరన్, ఫోలేట్ ఉండటంతో రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మరియు హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగేందుకు సహాయపడుతుంది.
మహిళలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, గర్భాశయ సంబంధిత ఇబ్బందులకు సోంపు సహాయపడుతుంది. అలాగే హార్మోన్లను కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
సోంపులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని టాన్ అవడం, మొటిమలు వంటి సమస్యల నుండి రక్షిస్తాయి. స్కిన్ గ్లో కి కూడా కారణమవుతుంది.
సోంపు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది ఎంతో మంచిది.
విటమిన్ A మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు సోంపులో ఉండటంతో కంటి చూపు మెరుగవుతుంది. ఇంకా కంటి అలసటను కూడా తగ్గిస్తుంది.
సోంపు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెటబాలిజం వేగంగా జరిగేలా చేస్తుంది. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది.