ప్రోటీన్ మూలం

పనస గింజలు సహజమైన ప్రోటీన్ మూలం. శరీర కణాల నిర్మాణం, కండరాల బలం, మరియు శక్తి ఉత్పత్తికి ఇవి ఎంతో సహాయపడతాయి.

స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్  

వీటిలో విటమిన్ C మరియు ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. 

డైజేషన్ ఫ్రీ 

పనస గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు తేలికగా ఉండి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.  

హార్ట్ హెల్త్  

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

షుగర్ లెవెల్స్ కంట్రోల్ 

పనస గింజల్లో నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. డయాబెటీస్ ఉన్న వారికి ఇది మేలైన ఆహారం.  

నేచురల్ గ్లో 

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ముడతలు, నల్ల మచ్చలు తగ్గిస్తాయి. చర్మం మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది.

హెయిర్ గ్రోత్ 

ప్రోటీన్, విటమిన్ A, మరియు ఐరన్ కారణంగా జుట్టు బలపడుతుంది. తల చర్మానికి రక్తప్రసరణ మెరుగై, కొత్త జుట్టు ఎదుగుతుంది.  

స్ట్రాంగ్ బోన్స్

పనస గింజల్లో కాల్షియం, ఐరన్, మరియు ఫాస్పరస్ ఉండటంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

మెమరీ పవర్  

వీటిలో ఉన్న థియమిన్, రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు నర్వస్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. జ్ఞాపకశక్తి, కేంద్రీకరణ పెరుగుతుంది.  

ఎనర్జీ బూస్టర్‌

సహజమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ కలిపి ఇవి శరీరానికి దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. రోజు ప్రారంభించడానికి పనస గింజలతో చేసిన స్నాక్ మంచి ఎనర్జీ బూస్టర్‌గా ఉంటుంది.