డైజేషన్ ఫ్రీ
అత్తి పండులో ఉన్న సహజ ఫైబర్ జీర్ణక్రియను బలపరుస్తుంది. రోజూ రెండు అత్తి పండ్లు తింటే మలబద్ధకం సమస్య తగ్గి, కడుపు తేలికగా ఉంటుంది.
బరువు తగ్గిస్తుంది
అత్తి పండులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్ట నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా అడ్డుకుంటుంది.
హార్ట్ హెల్త్
అత్తి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం గుండెకు మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె బ్లాక్‌లను నివారిస్తాయి.
షుగర్ ని తగ్గిస్తుంది
అత్తి పండు సహజ చక్కెరలు కలిగి ఉన్నా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఎముకలకు బలాన్నిస్తుంది
అత్తి పండులో కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను దూరంగా ఉంచుతాయి.
స్కిన్ గ్లో పెంచుతుంది
ఇందులో ఉన్న విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా చర్మానికి నేచురల్ గ్లో వస్తుంది.
బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది
పొటాషియం అధికంగా ఉండటం వలన సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది
పొటాషియం అధికంగా ఉండటం వలన సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది.
హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది
ఇందులో ఉన్న ఖనిజాలు, ఫైటోఎస్ట్రోజెన్లు హార్మోన్ల స్థాయిని సమతులం చేస్తాయి.
రక్తహీనతని నివారిస్తుంది
అత్తి పండులో ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.