ఐరన్ సమృద్ధి

డ్రై ఆప్రికాట్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

జీర్ణక్రియకు మేలు

డ్రై ఆప్రికాట్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

కంటి ఆరోగ్యానికి మంచివి

డ్రై ఆప్రికాట్లలో విటమిన్ A మరియు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తాయి.

స్కిన్ గ్లో 

డ్రై ఆప్రికాట్లు చర్మానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ను అందించి స్కిన్ గ్లో అయ్యేలా చేస్తాయి. 

ఎముకలకు బలం

డ్రై ఆప్రికాట్లలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచుతాయి.

హార్ట్ హెల్త్  

డ్రై ఆప్రికాట్లలో ఉండే పొటాషియం హృదయ స్పందనను సమతుల్యం చేస్తూ, రక్తపోటు తగ్గించటంలో సహాయపడుతుంది.

స్ట్రాంగ్ ఇమ్యూనిటీ 

డ్రై ఆప్రికాట్లలో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.

వెయిట్ మేనేజ్మెంట్  

డ్రై ఆప్రికాట్లలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న కారణంగా ఆకలి తగ్గి తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గుతారు. 

హెయిర్ గ్రోత్  

డ్రై ఆప్రికాట్లలో విటమిన్ E ఉండటం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉండి, జుట్టు మెత్తగా మారుతుంది.

షుగర్ కంట్రోల్ 

డ్రై ఆప్రికాట్లలో నేచురల్ షుగర్స్ ఉన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.