ఔషధ గుణాలు

సీతాఫలం ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల జ్వరం, విరేచనాలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు

వ్యాధుల నివారణ  

ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా కొన్ని వ్యాధులను కూడా నివారిస్తాయి. 

జీర్ణ ఆరోగ్యం 

సీతాఫలం ఆకులను టీ లేదా డికాషన్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

శ్వాసకోశ ఆరోగ్యం 

సీతాఫలం ఆకులు దగ్గు, ఆయాసం, ఎలర్జీ మరియు ఇతర శ్వాసకోశ అసౌకర్యాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. 

చర్మ సంరక్షణ

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఇది చర్మంపై మంట, చికాకు మరియు దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.

పోషకాలు గని 

సీతాఫలం ఆకులు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలకు మూలం. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మొత్తం పోషకాహారం తీసుకున్నట్లు అవుతుంది.

జుట్టు సంరక్షణ 

సీతాఫలం ఆకులు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

ఓరల్ హెల్త్ 

సీతాఫలం ఆకులను తరచుగా నమలడం లేదా వాటిని మౌత్‌వాష్‌లో ఉపయోగించడం వల్ల నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం, నోటి దుర్వాసనను తగ్గించడం మరియు నోటి ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో సహాయపడవచ్చు 

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ 

సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రోగ నిరోధక శక్తి  

సీతాఫలం ఆకులు మరిగించిన నీటిని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకొంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు ,జ్వరం వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు.