వెయిట్ లాస్

చియా సీడ్ వాటర్ తక్కువ కేలరీలతో ఎక్కువ సంతృప్తి ఇస్తుంది, దీంతో ఆకలి తగ్గి బరువు తగ్గుతారు.

డైజేషన్ ఫ్రీ 

చియా సీడ్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. ఫలితంగా డైజేషన్ ఫ్రీ అవుతుంది.  

నేచురల్ డిటాక్సిఫికేషన్

చియా సీడ్స్‌ వాటర్ శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించే నేచురల్ డిటాక్సిఫైర్ గా పనిచేస్తుంది.

హార్ట్ హెల్త్ 

దీనిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ హృదయ రోగాల ప్రమాదాల బారినుండీ తప్పించి గుండెని కాపాడతాయి. 

రెట్టింపు ఎనర్జీ

చియా సీడ్ వాటర్ తాగడం వలన రోజంతా రెట్టింపు ఎనర్జీతో ఉంటారు. ఇందులో ఉన్న ప్రోటీన్లు మరియు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి స్టామినా పెంచుతాయి.

స్కిన్ గ్లో 

రోజూ క్రమం తప్పకుండా చియా సీడ్ వాటర్ తాగితే చర్మం తేలికగా, మృదువుగా, న్యూట్రియంట్స్‌తో నిండినట్లుగా ఉంటుంది.  

హైడ్రేషన్ పెరుగుతుంది 

చియా సీడ్స్ నీటిని తాగటం వలన శరీరానికి అవసరమైన నీరు నిల్వ ఉండి, బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ఇమ్మ్యూనిటీ బూస్ట్

చియా సీడ్స్ వాటర్ లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్మ్యూనిటీని బూస్ట్ చేస్తాయి.  

బ్లడ్ షుగర్ కంట్రోల్

చియా సీడ్ వాటర్ రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ చేసి, షుగర్ స్పైక్స్‌ను తగ్గిస్తాయి.

స్ట్రాంగ్ బోన్స్

చియా సీడ్ లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలకి కావలసిన శక్తినిచ్చి బోన్ స్ట్రెంత్ ని పెంచుతాయి.