జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత
మన ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థ ఎంతో కీలకం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంతో పాటు వ్యర్థాలను బయటకు పంపుతుంది.
మైక్రోబయోమ్ పవర్
మన కడుపులో కోట్లాది మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణాన్ని మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇమ్యూన్ సిస్టంకి కనెక్షన్
70% రోగనిరోధక వ్యవస్థ జీర్ణ వ్యవస్థలోనే ఉంటుంది. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబైయోమ్ వైరస్, బాక్టీరియా నుంచి రక్షిస్తుంది.
ఆహారంలో ప్రీబయోటిక్స్, ప్రొబయోటిక్స్
పెరుగు, యోగర్ట్ వంటి ప్రొబయోటిక్స్; అరటి, ఉల్లిపాయలు వంటి ప్రీబయోటిక్స్ గట్ లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి
సరైన నిద్ర, తక్కువ ఒత్తిడి, వ్యాయామం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
ప్రాసెస్డ్ ఫుడ్ ముప్పు
అధిక ప్రాసెస్డ్ ఫుడ్ జీర్ణ వ్యవస్థ బ్యాక్టీరియాను దెబ్బతీసి, వ్యాధులకు కారణమవుతుంది.
నూనె, మసాలాలను పరిమితం చేయాలి
అధిక మసాలాలు, నూనెతో చేసిన ఆహారం జీర్ణ సమస్యలను కలిగించి, పొట్టలో అసహనాన్ని పెంచుతుంది.
నీటి లోపం దుష్ప్రభావం
శరీరానికి తగినంత నీరు తాగకపోతే జీర్ణ ప్రక్రియ మందగించి మలబద్ధకాన్ని తెచ్చిపెడుతుంది.
తీపి పదార్థాల వినియోగం
అధిక చక్కెర తినడం గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
నెలకు ఒకసారి డిటాక్స్
ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరాన్ని డిటాక్స్ చేయడం గట్ హెల్త్ మెరుగుపరిచే ఖచ్చితమైన మార్గం.