హల్దీలో ఉన్న కర్కుమిన్ అనే పదార్థం సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది కీళ్ల వాపు, నొప్పిని తగ్గించి కదలికను మెరుగుపరుస్తుంది.
అల్లం
అల్లంలో ఉండే జింజరోల్స్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు జాయింట్ల వాపును తగ్గించి, శరీరంలో రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.
ఓమేగా-3
సాల్మన్, సార్డిన్ వంటి చేపల్లో మరియు ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లలో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి కీళ్ల కదలికను మెరుగుపరుస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉన్న పాలీఫెనాల్స్ ముఖ్యంగా EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ పదార్థం కీళ్లలో ఇన్‌ఫ్లమేషన్ కలిగించే ఫ్రీ రాడికల్స్‌ని అడ్డుకుంటుంది.
బెర్రీస్
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీ, రాస్బెర్రీలో ఉన్న ఆంథోసయనిన్స్ (Anthocyanins) వాపు తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో ఉన్న ఒలియోకాంతాల్ అనే పదార్థం వాపు తగ్గించే ప్రభావం కలిగి ఉంటుంది. ఇది కీళ్ళపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.
బ్రోకోలీ
బ్రోకోలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఆర్థ్రిటిస్‌ను ప్రేరేపించే ఎంజైమ్స్‌ను నిరోధిస్తుంది. ఇంకా కీళ్లను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
వెల్లులి
వెల్లులిలో ఉన్న డయలిల్ డైసల్ఫైడ్ అనే పదార్థం ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే సైటోకైన్స్‌ను తగ్గిస్తుంది.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఉన్న ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కీళ్ల వాపు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
టమోటాలు క్యారెట్
టమోటాలలో లైకోపిన్, క్యారెట్‌లలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండి ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి కీళ్ల కణజాలాలను రక్షించి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.