నెమ్మదిగా శ్వాస పీల్చి, నెమ్మదిగా శ్వాస వదలండి. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది.
మెడను నెమ్మదిగా క్లా క్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది
భుజాలను పైకి, వెనక్కి నెమ్మదిగా తిప్పుతూ ఉండటం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.
గోడకు ఆనుకొని పడుకొని, కాళ్లను రెండిటినీ పైకి లేపి 5-10 నిమిషాలు అలానే ఉంచి విశ్రాంతి తీసుకోండి
కిందపడుకుని వెన్నెముకను పైకి, కిందికి వంచుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
పాదాలను రెండిటినీ కలిపి, మోకాళ్లను రెక్కల్లా ఆడిస్తూ, కొంతసేపు చేయండి. దీంతో మీ ఒత్తిడి తగ్గించుకోండి.
మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి మీ చేతులను పూర్తిగా చాచి కొద్దిసేపు విశ్రాంతి పొందండి.
శరీరంలోని ప్రతి భాగాన్ని కొద్దిసేపు నొక్కుతూ, కొంతసేపు అలా రిలాక్స్ అవ్వండి.
5-10 నిమిషాలు ధ్యానం చేసి, మనసులో ఏ ఆలోచనా రాణి విధంగా ప్రశాంతంగా ఉంచండి. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
శరీరాన్ని నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే నరాలు మొత్తం పూర్తిగా రిలాక్స్ అయి, ప్రశాంత నిద్ర వస్తుంది.