నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పేగు గోడల ఆరోగ్యాన్ని పెంచి, మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నెయ్యిలోని మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు శరీరంలో ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. ఇవి త్వరిత శక్తిని అందించగలవు,  

నెయ్యిలో ఒమేగా-3 మరియు ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో కేలరీలను తగ్గించగలవు. దీనిద్వారా బరువు నియంత్రించ బడుతుంది. 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవడం వల్ల ఆకలి మందగించేలా చేస్తుంది. దీంతో మనం ఎక్కువసార్లు  ఆహారం తీసుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

నెయ్యిలో ఉండే A, D, E విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

నెయ్యి శరీరం నుండి విషాన్ని తొలగింఛి, నేచురల్ డిటాక్సిఫికేషన్  ప్రక్రియకి  మద్దతునిస్తుంది. 

నెయ్యిలోని ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మ కణాల లోపలి వరకూ అబ్జార్బ్ అయ్యి, ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన ఛాయను అందిస్తాయి.

నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి హార్మోన్ ఉత్పత్తికి మరియు శరీరంలో సమతుల్యతకు కీలకం. 

ఖాళీ కడుపుతో నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తంగా మన ఆరోగ్యానికి దోహదపడుతుంది.