నెక్ రొటేషన్స్

నెమ్మదిగా మెడను వృత్తాకారంగా తిప్పండి. ఇది నిద్రలో పట్టేసిన మెడ కండరాలను రిలాక్స్ చేస్తుంది.

ఆర్మ్ స్ట్రెచ్ 

రెండు చేతులను పైకి చాపి కొద్ది సేపు అలానే గాలిలో నిలిపి ఉంచండి. ఇది భుజాలకు బలాన్ని ఇస్తుంది. 

షోల్డర్ రోల్స్ 

భుజాలను ముందుకు వెనక్కు తిప్పండి. రాత్రంతా కదలకుండా పట్టేసి ఉన్న కండరాలు యాక్టివ్ అవుతాయి. 

ఫార్వర్డ్ బెండ్  

నెమ్మదిగా ముందుకు వంగి పాదాలను తాకేలా ప్రయత్నించండి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

సైడ్ స్ట్రెచ్  

చేతులను పైకి చాపి, ఒక వైపు వంగండి. ఇది నడుము మరియు సైడ్ ఉండే కండరాలను స్ట్రెచ్ చేస్తుంది. 

లెగ్ స్వింగ్స్ 

ఒక కాలు నేలపై ఉంచి, రెండవ కాలు పైకి ఊపుతూ స్వింగ్ చేయండి. ఇది లెగ్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. 

క్వాడ్ స్ట్రెచ్ 

ఒక కాలు వెనక్కి వంచి దాని పాదాన్ని చేతితో పట్టుకుని, మీ తుంటిని నేరుగా ముందుకు మరియు మీ మోకాళ్లను దగ్గరగా ఉంచడం వల్ల తొడ కండరాలు బలపడతాయి. 

డీప్ బ్రీతింగ్ 

లోతుగా ఊపిరి పీల్చి వదలండి. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచి ఆక్సిజన్ లెవల్స్ ని పెంచుతుంది. 

సూర్య నమస్కారం 

ఉదయాన్నే సూర్యుడికి నమస్కరిస్తూ ఈ పూర్తి స్ట్రెచ్ రొటీన్ చేయండి — ఇది శరీరం మొత్తానికి శక్తినిస్తుంది.

క్యాట్-కౌ పోజ్  

మోకాళ్లపై వంగి వెన్నెముకను ముందుకు వెనక్కు వంచండి. ఇది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది.