ప్రేమతో మాట్లాడండి

పిల్లలతో కోపంగా కాకుండా, ప్రేమగా మాట్లాడటం వల్ల వారు చెప్పిన మాటను ఎక్కువగా వినిపిస్తారు. ఇది విశ్వాసాన్ని పెంచుతుంది.

నిబంధనలు ముందుగానే చెప్పండి 

ఏం చేయాలో, ఏం చేయకూడదో పిల్లలకు ముందుగానే వివరంగా చెప్పండి. అవి క్లియర్‌గా ఉండాలి. 

మంచి ప్రవర్తనకు బహుమతులు ఇవ్వండి 

పిల్లు మంచి పని చేసినప్పుడు ప్రశంసించండి లేదా చిన్న బహుమతిని ఇవ్వండి. ఇది మోటివేషన్ ఇస్తుంది.

ఉదాహరణగా ఉండండి 

పిల్లల ముందు మీరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్లు అలాగే నేర్చుకుంటారు. మీరు మంచి రోల్ మోడల్ అవ్వండి. 

ఆటలతో నేర్పండి 

శిక్షణను వారికి ఆటల రూపంలో ఇవ్వండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి సరదాగా ఆ పనిని నేర్పుతుంది. 

నిర్ణయాలకి అవకాశమివ్వండి  

పిల్లల్ని చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దీనితో వారు బాధ్యతాయుతంగా మారతారు.

సహనం పాటించండి  

పిల్లలన్నాక తప్పులు చేస్తారు, ఇది సహజం. కానీ వారిని కోపపడకుండా, సహనంతో పాటించండి. వారికి అర్ధమయ్యేలా వివరించండి. 

ధైర్యంగా మాట్లాడేలా చేయండి 

పిల్లలు భయపడకుండా భావాలు చెప్పేలా ప్రోత్సహించండి. వారు నమ్మకం పెంపొందించుకుంటారు.

రోజువారీ రొటీన్ ఏర్పాటు చేయండి  

నిర్దిష్ట సమయాల్లో అన్నీ జరిగేలా చూసుకోండి. శ్రమ లేకుండా క్రమశిక్షణ అలవాటవుతుంది.

పాజిటివ్ రిమైండర్స్ ఇవ్వండి  

నిరుత్సాహపరిచే మాటలకంటే, ప్రోత్సహించే మాటలు ఉపయోగించండి. పిల్లలు మారడానికి ఇది ఉత్తమ మార్గం