రోజూ పెరుగు, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది.
శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాలను ఎంపిక చేయండి.
నిత్యం 30 నిమిషాలు వాకింగ్, యోగా, వ్యాయామం చేయడం రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించి, డయాబెటిస్ తగ్గించడంలో సహాయపడుతుంది.
చక్కెర, మిఠాయిలు, శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, ఆరోగ్యంగా ఉండవచ్చు
మెంతికూర, పాలకూర, కొత్తమీర వంటి ఆకుకూరలు శరీరానికి పోషకాలు అందించి, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.
తెల్ల బియ్యం బదులుగా మిల్లెట్, గోధుమ రొట్టెలు తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి
ఎక్కువ చక్కెర కలిగిన పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. బదులుగా కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తీసుకోండి.
రోజుకి కనీసం 3 లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి, మెటాబాలిజం మెరుగుపడుతుంది.
బాదం, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి గింజలు గ్లూకోజ్ కంట్రోల్ చేయడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ కలిపి డయాబెటిస్ రివర్సల్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి మార్పులు చేసుకోండి.