ప్లేక్ రిమూవ్

ఫ్లాసింగ్ చేయడం వలన బ్రష్ చేయటం వీలుకాని చోట్ల ఉన్న ఫుడ్ రిసిడ్యూస్, ప్లేక్ వంటివి తొలగిపోతాయి.

చిగుర్ల ఆరోగ్యం 

రోజూ ఫ్లాసింగ్ చేస్తే నోటి చిగుర్లు బలంగా మారి, రక్తస్రావం లేదా ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి.

బ్యాడ్ బ్రీత్ 

ఫ్లాసింగ్ వల్ల పళ్ల మధ్య ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా తొలగిపోతుంది, అందువల్ల నోటిలో దుర్వాసన తగ్గుతుంది.  

ప్లేక్ & టార్టర్  

దంతాలను కప్పి ఉంచే ఒక జిగట పొర ప్లేక్. దీనిని మొదటి దశలోనే తొలగించడం ద్వారా టార్టర్ ఏర్పడకుండా నివారించవచ్చు.

క్యావిటీలు 

ఫ్లాసింగ్ చేయడం వల్ల పళ్ల మధ్య ఉన్న ఫుడ్ పాటికల్స్ తొలగిపోయి క్యావిటీలు రావడం తగ్గుతుంది.  

నోటి శుభ్రత 

ఫ్లాసింగ్‌తో పాటు బ్రషింగ్ చేస్తే మొత్తం నోటిలో శుభ్రత, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది.

గమ్ డిసీజ్‌ రిస్క్  

ఫ్లాసింగ్ చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. దీనివల్ల చిగుళ్లనుండీ వచ్చే రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. 

హార్ట్ హెల్త్  

నోటిలో బ్యాక్టీరియా తగ్గడం వల్ల హార్ట్‌కు హానికరమైన ఇన్‌ఫెక్షన్ అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయి.  

అందమైన నవ్వు  

ఫ్లాసింగ్ చేయడం వల్ల శుభ్రమైన పళ్లు, ఆరోగ్యకరమైన చిగుళ్లు కలిగి అందమైన చిరునవ్వు మీ సొంతం అవుతుంది.

డెంటల్ ఎక్స్ పెన్సెస్ 

రోజూ ఫ్లాసింగ్ అలవాటు కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో పెద్ద డెంటల్ ట్రీట్మెంట్ అవసరం తగ్గుతుంది.