నువ్వుల నూనె తాగితే మంచిది

నూనె వాడకం ఎక్కువైతే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే మితంగా తీసుకోవడం ఉత్తమం

రాత్రిపూట తింటే బరువు పెరుగుతారు 

సమయం ముఖ్యం కాదు, కేలరీలే ముఖ్యమైనవి. రాత్రి తినడాన్ని నియంత్రించాలి కాని పూర్తిగా మానకూడదు.

మైక్రోవేవ్ లో వండిన ఆహారం హానికరం 

మైక్రోవేవ్ రేడియేషన్ ఆహారానికి హాని చేయదు. సరైన టెంపరేచర్ లో వాడితే ఏ హానీ లేదు. 

తక్కువ నీళ్లు తాగితే మూత్రపిండాలకు హాని 

శరీర అవసరాన్ని బట్టి నీరు తాగాలి. ఓవర్ హైడ్రేషన్ కూడా హానికరమే 

ఆర్గానిక్ ఆహారం ఎల్లప్పుడూ ఆరోగ్యకరం 

అన్ని ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యకరం కావు. పోషకాలు, ప్రాసెసింగ్ పద్ధతులను అర్థం చేసుకోవాలి.

రోజుకు 8 గంటలు నిద్రపోతేనే ఆరోగ్యం బాగుంటుంది 

ప్రతి ఒక్కరికీ నిద్ర అవసరం భిన్నంగా ఉంటుంది. 6-9 గంటలు నాణ్యమైన నిద్ర సరిపోతుంది.

తియ్యని పదార్థాలు డయాబెటిస్‌కు కారణం 

అధిక కేలరీలు, జీవనశైలి కారణమవుతాయి. తియ్యటి పదార్థాలను సమతుల్యంగా తింటే ప్రమాదం లేదు. 

కోల్డ్ డ్రింక్స్ వల్ల జలుబు వస్తుంది 

నిజానికి జలుబు వైరస్ వల్లే వస్తుంది. అంతేకానీ, చల్లని పదార్థాలు కారణం కావు. 

తినేటప్పుడు నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది 

తినేటప్పుడు నీరు తాగడం జీర్ణక్రియకు హాని చేయదు. అవసరమైనపుడు తాగవచ్చు. 

చెవి రంధ్రం శుభ్రం చేయడానికి కాటన్ బడ్స్ వాడాలి 

కాటన్ బడ్స్ వాడితే లోపలకు మలినాలు వెళ్లి సమస్యలు కలిగించవచ్చు. సహజరీతిలో శుభ్రం అయ్యేలా వదిలేయాలి.