ఎముకలు బలహీనం

క్యాల్షియం తక్కువగా ఉంటే ఎముకలు బలహీనమై, సులభంగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్ట మరియు వెన్ను భాగాల్లో కూడా నొప్పులు రావచ్చు.

దంత సమస్యలు 

దంతాలు సెన్సిటివిటీ, చిగుళ్ళలో రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా క్యాల్షియం డెఫిషియన్సీ వల్లనే జరుగుతుంది.

కంటి సమస్యలు

క్యాల్షియం తక్కువగా ఉంటే కంటి క్రింద మచ్చలు, కళ్ళు ఎర్రబడటం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.

కండరాల నొప్పులు

మజిల్ క్రాంప్స్, కండరాల నొప్పులు, అలసట వంటి సమస్యలు క్యాల్షియం డెఫిషియన్సీ వల్లే ఎక్కువగా ఉంటాయి.

గోర్లు బలహీనమవడం 

కాలి గోర్లు, చేతి గోర్లు చిట్లటం, సులభంగా విరిగిపోవడం, సరిగ్గా పెరగకపోవడం ఇవన్నీ క్యాల్షియం లోపం కారణమే.

హార్మోన్ ఇమ్బ్యాలెన్స్  

మహిళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఎఫెక్ట్ అవ్వడం, ప్రీ-మెన్స్ట్రువల్ సింటమ్స్ ఎక్కువగా రావడం, హార్మోన్ ఇమ్బ్యాలెన్స్ కారణంగా ఏర్పడతాయి.

మోకాళ్ళ నొప్పులు

మోకాళ్లలో నొప్పులు, కండరాల బలహీనత, జాయింట్ పెయిన్స్ ఇది క్యాల్షియం డెఫిషియన్సీ వల్లే ఎక్కువగా జరుగుతుంది.

జ్ఞాపకశక్తి తగ్గడం 

బ్రెయిన్ ఫాగ్, కాన్సంట్రేషన్ లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇవన్నీ క్యాల్షియం లోపంతో సంబంధం కల్గి ఉంటాయి.

హార్ట్ ప్రాబ్లెమ్స్  

గుండె కొట్టుకోవడంలో ఆటంకాలు, దడ, రక్తపోటులో హెచ్చుతగ్గులు. ఇది క్యాల్షియం డెఫిషియన్సీ వల్లే జరుగుతుంది.

చర్మ సమస్యలు

చర్మం పై మచ్చలు, డ్రై నెస్, సెన్సిటివిటీ, ఇచ్చింగ్, క్రాక్ద్ స్కిన్ వంటి సమస్యలు. స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గటం వంటి సమస్యలు ఏర్పడతాయి.