గుడ్లు మంచి ప్రోటీన్‌ సోర్స్. ప్రతి రోజు రెండు గుడ్లు తింటే కండరాల పెరుగుదలకు శక్తి,, బలం సహజంగా పెరుగుతాయి.

పాలు శరీరానికి ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి. వ్యాయామం తర్వాత ఒక గ్లాస్ పాలు తాగితే మజిల్స్ త్వరగా రికవర్ అవుతాయి.

పల్లీలు మరియు పీనట్ బటర్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఇస్తాయి. ఇవి తింటే బాడీకి అవసరమైన ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది.

చికెన్ బ్రెస్ట్ లీన్ ప్రోటీన్ సోర్స్. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కండరాల పరిమాణం పెరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది.

పప్పులు మరియు కందులు వెజిటేరియన్లకు ఉత్తమ ఎంపిక. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండి మజిల్ గ్రోత్‌కు సహాయపడుతుంది.

పనీర్ మంచి ప్రోటీన్ సోర్స్. రాత్రి భోజనంలో కొంచెం పనీర్ తీసుకుంటే కండరాల రిపేర్ ప్రక్రియ బాగా జరుగుతుంది 

వర్కౌట్ ముందు బనానా తింటే వెంటనే ఎనర్జీ ఇస్తుంది. పొటాషియం వల్ల మజిల్ క్రాంప్స్ తగ్గి స్టామినా పెరుగుతుంది.

ఓట్స్ కాంప్లెక్స్ కార్బ్స్ ఇస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే శరీరానికి స్థిరమైన శక్తి లభించి వర్కౌట్ మెరుగవుతుంది.

బాదం మరియు వాల్‌నట్స్ మంచి ఫ్యాట్స్, ప్రోటీన్ ఇస్తాయి. రోజుకు కొద్దిగా తింటే మజిల్ బిల్డింగ్‌కు సహాయపడతాయి.

పచ్చి కూరగాయలు, పాలకూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువ. రక్తప్రసరణ మెరుగై కండరాలకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది.