నీరు ఎక్కువగా తాగండి

రోజంతా తగినంత నీరు తాగకపోతే గోర్లు పొడిబారి, సులభంగా విరిగిపోతాయి. రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగడం గోర్లకు అవసరమైన తేమను ఇస్తుంది.

బయోటిన్ రిచ్ ఆహారం

బయోటిన్ అనే విటమిన్ గోర్ల ఆరోగ్యానికి ముఖ్యమైనది. దీనికోసం గుడ్లు, బాదం, వేరుశెనగ, స్వీట్ పోటాటో లాంటి ఆహారాలను తరచూ డైట్‌లో చేర్చండి. 

నెయిల్ పాలిష్ వాడకాన్ని తగ్గించండి

కఠినమైన రసాయనాలు కలిగిన నెయిల్ పాలిష్ లేదా రిమూవర్ ఎక్కువగా వాడితే గోర్లు బలహీనమవుతాయి.  

నెయిల్ మాయిశ్చరైజర్ వాడండి 

గోర్లకు తేమ అవసరం ఉంటుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా షియా బట్టర్‌తో గోర్లపై రాత్రిపూట మర్దనా చేస్తే అవి బలంగా, మెరుస్తూ ఉంటాయి 

గ్లోవ్స్ ధరించడం మర్చిపోవద్దు

డిష్ వాష్ లేదా హౌస్‌హోల్డ్ వర్క్‌లో ఉపయోగించే డిటర్జెంట్లు గోర్లలోని సహజ తేమను తగ్గిస్తాయి. కాబట్టి గ్లోవ్స్ ధరించడం ద్వారా రక్షణ పొందవచ్చు. 

ప్రోటీన్ రిచ్ డైట్ 

గోర్లు ప్రధానంగా ప్రోటీన్‌తో తయారవుతాయి. చికెన్, పప్పులు, పెరుగు, క్వినోవా వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ గోర్లను బలపరుస్తుంది.

ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ 

ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపలు వంటి ఆహారాల్లో ఉండే ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గోర్లలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి.

రెగ్యులర్‌గా ట్రిమ్ & క్లీన్

చాలా పొడవుగా పెంచిన గోర్లు విరిగిపోవడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి రెగ్యులర్‌గా కట్ చేసి, క్లీన్‌గా ఉంచడం చాలా ముఖ్యం. 

గోర్లను పనిముట్లుగా వాడకండి

టిన్స్, బాటిల్స్ లేదా ప్యాకెట్లు ఓపెన్ చేయడానికి గోర్లను వాడకండి. దీంతో అవి చిట్లిపోవడం లేదా విరిగిపోవడం తప్పదు.

విటమిన్స్ & మినరల్స్ చెక్ చేయించుకోండి

విటమిన్ డి లేదా ఐరన్ లోపం కూడా బ్రిటిల్ నెయిల్స్ కి కారణం కావచ్చు. డాక్టర్ సలహా మేరకు రక్తపరీక్ష చేయించుకుని అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోవాలి.