నీరు ఎక్కువగా తాగండి! 

రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. డీహైడ్రేషన్ మీ బ్రెయిన్ ని మందకొడిగా మారుస్తుంది. తగినంత నీరు తాగితే మెదడు స్పష్టంగా పనిచేస్తుంది. 

నీరు ఎక్కువగా తాగండి! 

రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్ర లోపం మీ బ్రెయిన్ ని క్లౌడీగా మార్చి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. నిద్ర అలవాటును మార్చుకోండి.

పోషకాహారం తినండి! 

ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారం తినండి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫోకస్ మెరుగుపడుతుంది.  

మెదడుకు వ్యాయామం ఇవ్వండి!

పజిల్స్, ప్రాబ్లెమ్ సాల్వింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం వంటి మానసిక వ్యాయామాలు మెదడుకు పదును పెడతాయి.

స్ట్రెస్ తగ్గించుకోండి! 

ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చేయండి. అధిక ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్‌ను పెంచుతుంది. మానసిక ప్రశాంతత మెదడును తాజాగా ఉంచుతుంది.  

శరీర వ్యాయామం చేయండి!

రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జిమ్ లేదా యోగా చేయండి. రక్తప్రసరణ మెరుగై, మెదడుకి తగినంతగా ఆక్సిజన్ అందుకుంటుంది.

కాఫీ తగ్గించండి!

అధికంగా కాఫీ తాగితే కొంతకాలానికి ఫోకస్ తగ్గిపోతుంది. ప్రతిరోజూ ఒకటి రెండు కప్పులకంటే ఎక్కువ కాకుండా పరిమితం చేయండి.  

డిజిటల్ డిటాక్స్ చేయండి!

సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఎక్కువగా వాడటం మెదడుకు ఒత్తిడిని కలిగిస్తుంది. రోజుకు కొన్ని గంటలు గాడ్జెట్లకు దూరంగా ఉండండి.

ప్రకృతిలో గడపండి!

చీకటి వాతావరణంలో కూర్చోకండి. పచ్చదనంలో గడిపితే మెదడు కొత్త ఉల్లాసాన్ని పొందుతుంది, బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది.  

స్నేహితులతో మాట్లాడండి!

అలసటగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి. సామాజిక అనుబంధం మెదడుకు ఓ మంచి వ్యాయామం.