మెడిటరేనియన్ డైట్
ఆలివ్ ఆయిల్, పళ్ళు, కూరగాయలు, చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.
డ్యాష్ డైట్
హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవారికి బెస్ట్. ఉప్పు తక్కువగా, కూరగాయలు, పళ్ళు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం.
ప్లాంట్ బేస్డ్ డైట్
కూరగాయలు, పళ్ళు, పప్పులు, విత్తనాలు – మొక్కల ఆధారిత ఆహారం శరీరానికి తేలికగా ఉంటుంది.
ఫ్లెక్సిటేరియన్ డైట్
శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యం, కానీ అప్పుడప్పుడు మాత్రమే నాన్‌వెజ్ తీసుకునే విధానం.
మైండ్ డైట్
మెదడు ఆరోగ్యానికి మంచిది. ఈ డైట్ లో గ్రీన్ వెజిటబుల్స్, బెర్రీలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
హోల్ 30 డైట్
పూర్తిగా 30 రోజులపాటు షుగర్, పాలు, ప్రాసెస్ ఫుడ్ వంటివి మానేసి సహజ ఆహారం మాత్రమే తీసుకోవడం.
హై-ప్రోటీన్ డైట్
మసిల్స్ గ్రోత్, వెయిట్ లాస్ కోసం చికెన్, చేపలు, గుడ్లు, పప్పులు వంటి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
16 గంటలు ఉపవాసం, 8 గంటల్లో మాత్రమే తినే పద్ధతి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బ్యాలెన్స్‌డ్ డైట్
ప్రతి భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ సమంగా ఉండే ఆహారం ఎప్పటికీ బెస్ట్.