డైజేషన్ ఫ్రీ
సలాడ్‌లో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహించి, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
తక్కువగా తినటం
భోజనానికి ముందు సలాడ్ తింటే కడుపు నిండిన భావం కలిగి, మిగతా భోజనం తక్కువగా తీసుకుంటారు.
వెయిట్ లాస్
తక్కువ క్యాలరీలతో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్లు ఉండి బరువు తగ్గడానికి సలాడ్ చాలా ఉపయోగం.
బ్లడ్ షుగర్ కంట్రోల్
సలాడ్ ముందుగా తినడం వల్ల గ్లూకోజ్ అబ్జార్ప్షన్ నెమ్మదిగా జరుగుతుంది, దాంతో బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కాంతివంతమైన చర్మం
సలాడ్‌లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపును ఇస్తాయి. దీంతో నేచురల్ గ్లో వస్తుంది.
నేచురల్ డిటాక్స్
పచ్చి కూరగాయల్లో ఉన్న నీరు, ఫైబర్ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి.ఫలితంగా నేచురల్ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
హార్ట్ హెల్త్
ఆకుకూరలు, కూరగాయల్లో ఉన్న ఫోలేట్ మరియు పొటాషియం వంటివి హృదయ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
స్ట్రాంగ్ ఇమ్యూనిటీ
సలాడ్ లో ఉండే విటమిన్ C, విటమిన్ A వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఉబ్బరం తగ్గుతుంది
పచ్చి కూరగాయలను తీసుకోవడం వలన కడుపులో బ్లోటింగ్ సమస్య తగ్గి, భోజనం తేలికగా అనిపిస్తుంది.
ఎనర్జీ బూస్టర్
నేచురల్ న్యూట్రియెంట్స్‌తో ఉన్న సలాడ్ తీసుకొంటే రోజంతా ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది.